Post Views: 112
సేవకుంజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఆరో ఏడాది నిర్వహణ – భక్తులకు హరికథ, హరినామ సంకీర్తన, మహాఅన్నప్రసాదం
బోధన్, జూలై 16 (ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సేవకుంజ్ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవాన్ని శుక్రవారం (జూలై 17) అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు విటల్ ప్రభు, వైశాలి మాతాజీ తెలిపారు.
రథయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు రాకాసిపేట్ బస్టాప్‌లోని సేవకుంజ్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా, పెద్ద హనుమాన్ మందిరం, కొత్త బస్టాండ్ మీదుగా సాగి స్థానిక టీటీడీ కళ్యాణ మండపం వద్ద ముగుస్తుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా విటల్ ప్రభు మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలుగా శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్.జీ. జననీవాస్ దాస్ ప్రభుజీ ఆధ్వర్యంలో హరికథ, హెచ్.జీ. గౌర్ గోపాల్ దాస్ అధికారి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
రథయాత్ర ముగిసిన అనంతరం భక్తులందరికీ మహాఅన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బోధన్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా హాజరై శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీస్సులు పొందాలని సేవకుంజ్ భక్త బృందం నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో విటల్ ప్రభు, వైశాలి మాతాజీ, శ్రీరామ్ ప్రభు, రవి ప్రభు, శ్యామ్ ప్రభు, మాధవి మాతాజీ, వాణి మాతాజీ, శాంతి మాతాజీతో పాటు మహిళా భక్తులు పాల్గొన్నారు.
“భక్తి ఉన్న చోటే భగవంతుని అనుగ్రహం ఉంటుంది.”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







