-- --

గోదావరి పుష్కరాలపై పోలీసుల ముందస్తు కసరత్తు పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన సీపీ పి. సాయి చైతన్య

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మెండోరా, జూలై 16: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఘాట్ల నిర్మాణ పనులు, భక్తుల రాకపోకలకు అనువైన మార్గాలు, వాకింగ్ ట్రాక్‌లు, వాహనాల పార్కింగ్, అత్యవసర సేవల కోసం అవసరమైన సదుపాయాలు, హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటుపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ పరిశీలనలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, ఇరిగేషన్ శాఖ డీఈ సురేష్, ఏఈ సుశాంత్ కుమార్, వంశీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ముందు జాగ్రత్త – ముప్పు దూరం.”
पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more