“నేర్చుకున్న నాయకత్వమే గ్రామాభివృద్ధికి నిజమైన బాట.”
కోటగిరి, జూలై 16: కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామ సర్పంచ్ శ్వేత సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహిళా సర్పంచ్‌ల ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి అధికారికంగా ఎంపికయ్యారు.
జిల్లా నుంచి కేవలం ఇద్దరు మహిళా సర్పంచ్‌లకే ఈ ప్రతిష్ఠాత్మక శిక్షణలో పాల్గొనే అవకాశం లభించగా, వారిలో శ్వేత సూర్యకాంత్ ఒకరిగా ఎంపిక కావడం ఎత్తోండ గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళా ప్రజాప్రతినిధుల నాయకత్వ నైపుణ్యాలు, సమర్థవంతమైన గ్రామ పాలన, అభివృద్ధి ప్రణాళికల అమలు, పారదర్శక పరిపాలన, ప్రజా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ప్రత్యేక శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

శ్వేత సూర్యకాంత్ ఎంపికపై గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ, శిక్షణలో పొందిన అనుభవం గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







