-- --

ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం: బి. మల్లేష్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

త్యాగం చేసిన వారి అడుగుజాడలే సమాజానికి మార్గదర్శకం.”

బోధన్, జూలై 16:

ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగించాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు.

గురువారం బోధన్ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ సమీపంలోని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ జెండా గద్దె వద్ద కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించబడటంతో కామ్రేడ్ చంద్రశేఖర్ అజ్ఞాత జీవితంలోకి వెళ్లి విప్లవ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు వెంకటనారాయణ వారసత్వాన్ని, తన కుటుంబ విప్లవ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నూతన ప్రజాస్వామ్య విప్లవానికి జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ అనంతరం పార్టీ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అనంతరం పార్టీ ఆఫీస్ బేరర్‌గా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ పార్టీ అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించారని కొనియాడారు.

1996లో కామ్రేడ్ ఎల్లన్న ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో ఇల్లెందు ప్రాంతంలో పార్టీ బాధ్యతలను స్వీకరించి ఉద్యమాన్ని ముందుకు నడిపారని తెలిపారు. రైతాంగ ఉద్యమంలో అఖిల భారత స్థాయి నాయకుడిగా ఉత్తర భారతదేశంలో పర్యటించడంతో పాటు, చారిత్రాత్మక ఢిల్లీ సరిహద్దు రైతు ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని చెప్పారు.

పార్టీలో సిద్ధాంతపరమైన చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన చంద్రశేఖర్, ప్రజాపంథా సిద్ధాంతం సరైనదని నమ్మి ఆ దిశగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని బి. మల్లేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు పడాల శంకర్, ధ్యాకం పోశెట్టి, ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణితో పాటు లక్ష్మి, పద్మ, సావిత్రి, పోసాని, రాజమణి, అనసూయ, రమ, సుశీల, గంగామణి, సీహెచ్ రమేష్, రాములు, ఎస్‌కే పాషా, కాజా, గంగారం, చిన్నయ్య, శంకర్, సురేష్, సాయిలు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more