నేడు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు.. జూలై 15న సమాచార్ భవన్ ముట్టడికి TWJF పిలుపు
హైదరాబాద్, జూలై 12 (ప్రతినిధి):
తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి సంయుక్త ప్రకటనలో తెలిపారు.
వారు వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 13న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బహిరంగ నిరసన కార్యక్రమాలు, జూలై 15న హైదరాబాద్‌లోని వద్ద మహాధర్నా, ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అనవసర జాప్యం, పారదర్శకత లోపం కారణంగా అనేక మంది అర్హులైన జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అక్రిడిటేషన్ కమిటీల్లో ఒకే వర్గానికి ప్రాధాన్యత కల్పించడం వల్ల నిష్పక్షపాత నిర్ణయాలు జరగడం లేదని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నాలుగు దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల హామీ అమలు కాలేదని పేర్కొంటూ, ప్రత్యేక విధానాన్ని రూపొందించి అర్హులైన జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు జారీ చేసి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ, మెట్రో సేవల్లో జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇతర రాష్ట్రాల్లో మూడో వంతు (1/3) రాయితీ, అలాగే రైల్వే జర్నలిస్టు పాస్‌ల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, ప్రజాసంఘాలు విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకత్వం పిలుపునిచ్చింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







