మాక్లూర్, జూలై 12 (ప్రతినిధి): మాక్లూర్ మండలంలోని మదన్‌పల్లి గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా వ్యాస గురు భరద్వాజ్ గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘ కార్యకర్తలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో గురువుకు ఉన్న విశిష్ట స్థానాన్ని వివరించారు. భారతీయ సంప్రదాయంలో ముందుగా తల్లి, తరువాత తండ్రి, అనంతరం అతిథి, గురువు, ఋషులు, మునులకు అత్యున్నత గౌరవం ఇవ్వడం మన సంస్కృతి గొప్పతనమని పేర్కొన్నారు. అలాగే త్యాగం, ధర్మం, సేవకు ప్రతీకగా భావించే కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి, సమాజ విజయానికి అది స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీటీసీ గోవూరు ఒడ్డెన్న, నక్కల గంగాధర్, చౌడ లక్ష్మణ్ హాజరై గురుపూజోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘ కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







