-- --

పెగడపల్లిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన శేఖర్ గౌడ్ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూలై 12 (వి.1 న్యూస్):

బోధన్ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి శేఖర్ గౌడ్ ఆదివారం బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలో నియమితులైన ఇన్‌చార్జుల పర్యవేక్షణలో వార్డుల వారీగా జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించి, బీఎల్‌ఏ ఏజెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్ల నమోదు, సవరణలు, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయకపోతే అర్హులైన వేలాది మంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా అధికారులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఓటరు నమోదు, సవరణల ప్రక్రియలో అవసరమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, సర్పంచ్ రచన సుదర్శన్, ఉపసర్పంచ్ షబ్బీర్, సార్గం పోతారెడ్డి, కోట గిరారెడ్డి, భూలక్ష్మి క్యాంపు సర్పంచ్ బాల్ రెడ్డి, బర్దిపూర్ బీఎల్‌ఏ నరేందర్ రెడ్డి, ముత్తిరామ్, బీఎల్‌ఏలు శ్యామల, అరుణ, వీఓఏ పరుచూరి అనిత శ్రీనివాస్, గాండ్ల గణేష్, నాగరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more