హైదరాబాద్, జులై 12 (v1news న్యూస్): తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు.
ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన సుమారు వెయ్యి అభ్యంతరాల కాపీలను తమకు అందించాలని, వాటి వివరాలు ఇవ్వకుండా సమాధానం ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా ఒకే తరహా పేర్లతో వందలాది రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, తమ పార్టీ విషయంలో మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
అలాగే, ప్రజా ప్రతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29A ప్రకారం తెలంగాణ రక్షణ సేన పార్టీ గుర్తింపు దరఖాస్తును నిష్పాక్షికంగా పరిశీలించి, త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం తొలుత కేటాయించిన పేరుతోనే రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగరవేశామని, ఇప్పుడు పేరు మార్చాలని సూచించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఒకే తరహా పేర్లతో పలు పార్టీలకు గుర్తింపు ఇచ్చిన నేపథ్యంలో, తెలంగాణ రక్షణ సేన పార్టీపైనే అభ్యంతరాలు వ్యక్తం చేయడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







