సాలూర మండలంలో అక్రమ జూదంపై విచారణకు ప్రజల డిమాండ్**
“చిన్న చిచ్చును ఆర్పకపోతే… పెద్ద మంటగా మారుతుంది!”
సాలూర, ప్రతినిధి:
సాలూర మండలంలోని హుంసా, మందర్ణ, హెగడోల్లి గ్రామాల శివార్లు, మంజీరా పరివాహక ప్రాంతాలు, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, మామిడి తోటలు, అరటి తోటలు, పంట పొలాలు, అడవి ప్రాంతాల్లో అక్రమ పేకాట జరుగుతోందంటూ స్థానికులు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, పేకాట నిర్వాహకులు రోజువారీగా స్థావరాలు మారుస్తూ, మామిడి, అరటి తోటలు, పంట పొలాల్లో ఏర్పాటు చేసిన షెడ్లు, వ్యవసాయ క్షేత్రాల్లోని గెస్ట్ హౌస్లు, పాడుబడిన భవనాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సంబంధిత శాఖలు సమగ్ర నిఘా ఏర్పాటు చేసి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.

అలాగే, జూదానికి వచ్చే వారికి డబ్బులు అప్పుగా ఇవ్వడం, వాహనాలను తాకట్టు పెట్టించుకోవడం, వివిధ సౌకర్యాలు కల్పించడం ద్వారా కొందరు జూదానికి బానిసలవుతున్నారని బాధితులు చెబుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి వల్ల యువత, రైతులు, కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో గతంలో పేకాట కేసుల్లో పట్టుబడిన కొందరు వ్యక్తులు మళ్లీ చురుకుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోందని, ఈ అంశంపై కూడా విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే, కొందరు ప్రభావశీలుల పాత్రపై స్థానికంగా వినిపిస్తున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో కూడా అధికారులు దర్యాప్తు ద్వారా స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ కథనం స్థానికులు, జూదం కారణంగా నష్టపోయామని చెప్పిన కొందరు బాధితులు అందించిన సమాచారం ఆధారంగా ప్రజల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తున్నది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణల నిజానిజాలు నిర్ధారించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఉన్నట్లయితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








