-- --

నేరాల నియంత్రణే లక్ష్యం.. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం – డ్రగ్స్, గంజాయి, పేకాట, గుట్కా, అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం • రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణకు ఆదేశాలు..

ఆర్మూర్, జూలై 10 ():
రాబోయే పండుగల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి లోటు లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, నేరాల నియంత్రణలో ప్రతి పోలీస్ అధికారి అప్రమత్తంగా వ్యవహరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఆర్మూర్ డివిజన్ నేరాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు తదితర అధికారులు పాల్గొన్నారు.

కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పండుగల నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలు నిర్వహించాలని, వాహనాల తనిఖీల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దని స్పష్టం చేశారు. హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా వ్యాపారాలకు సంబంధించిన కేసులను వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రౌడీషీటర్లు, పాత నేరస్తులు, బెయిల్‌పై విడుదలైన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు ఆయా జిల్లాల పోలీసులతో సమన్వయం పెంచాలని సూచించారు.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆన్‌లైన్ మోసాల బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని, పేకాట, గుట్కా, ఇసుక సహా అన్ని రకాల అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రజలకు పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణతో పాటు సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర నియంత్రణలో సమర్థంగా వినియోగించాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషనర్, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, హైవేలకు అనుసంధానమైన లింక్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, రోడ్ల పక్కనున్న పొదలను తొలగించడం, ఇంజినీరింగ్ లోపాలను సంబంధిత శాఖల సమన్వయంతో సరిదిద్దాలని సూచించారు. ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్యతో పాటు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more