నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలంటూ వార్డెన్‌కు సూచనలు.. నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక…
బాన్సువాడ, జూలై 10: బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వసతిగృహాన్ని శుక్రవారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వసతిగృహంలో నివసిస్తున్న విద్యార్థులతో మాట్లాడి, వారికి అందుతున్న భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా PDSF ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్. బాల్‌రాజ్, DSFI జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ మాట్లాడుతూ, హాస్టల్‌లో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్ శివరాంకు సూచించారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లాలని, స్పందన లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం జరిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే ఉద్యమాలు చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి, హాస్టల్‌లో అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండేలా వార్డెన్లు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర నాయకుడు సాయిబాబా, TNSF జిల్లా నాయకుడు పుట్ట భాస్కర్తో పాటు వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







