-- --

ఏకచక్ర శివాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు ఘన సన్మానం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

బోధన్, జూలై 10:
బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ ఏకచక్ర శివాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ పంతులు, మహేష్ పంతులు తదితరులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్న ఆలయ చైర్మన్ ఆగంటే లక్ష్మణ్‌రావు పటేల్, ధర్మకర్తలు ఆరుగొండ శంకర్, జక్కం వీరప్ప, సున్నం గంగాధర్, వీరాపురం మౌనిక పోశెట్టిలను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని పరమేశ్వరుని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

కార్యక్రమం ముగింపులో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more