బాన్సువాడ, జూలై 10: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కొయ్యగుట్టల అటవీ ప్రాంతం గుట్టుచప్పుడు కాకుండా పేకాట స్థావరంగా మారిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అడవి ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని భారీ మొత్తాల్లో పేకాట నిర్వహిస్తూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అక్రమ పేకాట కార్యకలాపాలను “అంత్య గ్యాంగ్” నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమీప ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఆటగాళ్లు ఇక్కడికి వచ్చి భారీ మొత్తాల్లో పేకాట ఆడుతున్నారని చెబుతున్నారు.
సులభంగా డబ్బు వస్తుందనే ఆశ చూపించి యువకులను ఈ వ్యసనంలోకి దింపుతున్నారని, దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పేకాట స్థావరాల వద్ద కొందరు యువకులను “కవరింగ్ బాయ్స్”గా నియమించి, పోలీసుల కదలికలు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే నిర్వాహకులకు సమాచారం చేరవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో దాడులకు ముందే నిర్వాహకులు అప్రమత్తమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అడవిని అడ్డాగా చేసుకుని చట్టాన్ని ధిక్కరిస్తూ ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆరోపణలపై పోలీసు శాఖ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు వెంటనే స్పందించి, కొయ్యగుట్టల అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించి, వాస్తవాలను నిర్ధారించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలు బయటపడితే బాధ్యులపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“అడవిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని నిరూపించేలా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి” అని స్థానికులు కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







