-- --

SIR-2026 డిజిటైజేషన్‌లో 100% పురోగతి సాధించిన ఇద్దరు BLOలకు RDO విజయకుమారి అభినందనలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

బోధన్, జూలై 10: బోధన్ శాసనసభ నియోజకవర్గం (012) పరిధిలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంలో డిజిటైజేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన ఇద్దరు బూత్ లెవల్ అధికారులను (BLOలు) బోధన్ ఆర్డీవో శ్రీమతి ఎం. విజయకుమారి శుక్రవారం అభినందించారు.

ఈ సందర్భంగా రాంపూర్ పోలింగ్ స్టేషన్ నెం. 09కు చెందిన శ్రీమతి సునంద, బండార్పల్లి పోలింగ్ స్టేషన్ నెం. 18కు చెందిన శ్రీమతి ఏ. అనసూయలను ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేకంగా సన్మానించి వారి సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి ఈ. సాయిలు, బోధన్ తహసీల్దార్ పీ. విఠల్, EPIC నాయిబ్ తహసీల్దార్ శ్రీమతి నాగమణి, సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి సుశీల, బోధన్ మండల ప్రణాళికా మరియు గణాంకాల అధికారి అశోక్, ఆపరేటర్ ముస్తఫా తదితరులు పాల్గొని ఇద్దరు BLOలను అభినందించారు.

ఈ సందర్భంగా సునంద, అనసూయ మాట్లాడుతూ తమ పరిధిలోని డిజిటైజేషన్ పనులను 100 శాతం పూర్తి చేసినప్పటికీ అక్కడితో ఆగకుండా, పురోగతి తక్కువగా ఉన్న ఇతర BLOలకు అవసరమైన సహాయం అందించి SIR-2026 ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని వారు ఆర్డీవోకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆర్డీవో విజయకుమారి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో BLOల పాత్ర అత్యంత కీలకమని, ఇదే స్ఫూర్తితో మిగిలిన BLOలు కూడా డిజిటైజేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేసి SIR-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more