-- --

సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ సమీక్ష సమావేశం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

సాలూర మండలంలో BLA-2లతో విస్తృత చర్చలు

సాలూర, జూలై 10: సాలూర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో BLA-2లతో సమావేశం నిర్వహించి, ప్రస్తుతం కొనసాగుతున్న SIR (సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ) పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటరు జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా BLA-2లు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ SIR ఇంచార్జి, రాష్ట్ర గీత కార్మిక సంఘం అధ్యక్షులు శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లే రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇల్తేపు శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మందర్నా రవితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, BLA-2లు పాల్గొన్నారు. సమావేశంలో ఓటరు జాబితా సవరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more