-- --

వైఎస్సార్ సేవలను స్మరించుకుందాం – ఉపాధ్యాయ, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడే నిజమైన నాయకుడు.”

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ప్రజా సంక్షేమానికి అందించిన సేవలను స్మరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాల్ సింగ్ సోడి పేర్కొన్నారు.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రజాహిత పథకాలను అమలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో విశేష మార్పును తీసుకొచ్చాయని తెలిపారు.

అలాగే, అప్పట్లో తెలంగాణ స్కూల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాను ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని కృపాల్ సింగ్ సోడి ప్రస్తావించారు.

రేపు జరగనున్న డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాల్లో ప్రజలు, ఉపాధ్యాయులు, అభిమానులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more