“అప్రమత్తతే రక్షణ… అవగాహనే భద్రతకు ఆయుధం.”
బోధన్, జూలై 7:
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బోధన్ పోలీసులు “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” నినాదంతో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలోని పాత బస్టాండ్‌తో పాటు రద్దీ ప్రాంతాల్లో ఎస్‌ఐ హబీబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా, దొంగతనాల నివారణలో భాగంగా ఇళ్లు, వ్యాపార సంస్థలు, విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉంటూ తన భద్రతతో పాటు సమాజ భద్రతకు బాధ్యతాయుతంగా సహకరించాలని బోధన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







