-- --

ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయవాదులు సమన్వయంతో కృషి చేయాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. ముక్తిద

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

కామారెడ్డి, జూలై 7: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించనున్న ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం కామారెడ్డి బార్ అసోసియేషన్ హాల్‌లో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఎన్‌ఐ యాక్ట్) కేసుల త్వరిత పరిష్కారం, న్యాయవాదుల పాత్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) చైర్‌పర్సన్ శ్రీమతి పి. ముక్తిద అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజీకి అవకాశం ఉన్న పెండింగ్ ఎన్‌ఐ యాక్ట్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు న్యాయవాదులు, సంబంధిత పక్షాలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. రాజీ ద్వారా కేసులు పరిష్కారమైతే సమయం, ధనం ఆదా కావడంతో పాటు పక్షాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని అన్నారు.

సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి డా. సూర సుమలత మాట్లాడుతూ, ఎన్‌ఐ యాక్ట్ కేసుల్లో రాజీకి అధిక అవకాశాలు ఉన్నందున సంబంధిత పక్షాలకు చట్టపరమైన అవగాహన కల్పించి, పరస్పర అంగీకారంతో వివాదాల పరిష్కారానికి న్యాయవాదులు చొరవ చూపాలని సూచించారు. కేసుల పెండెన్సీ తగ్గించి సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.

కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. నారాయణ మాట్లాడుతూ, న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా న్యాయవాదులు పూర్తి సహకారం అందిస్తూ ఎన్‌ఐ యాక్ట్ కేసుల త్వరిత పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి కే. సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి దీక్ష, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

: రాజీ ఉన్న చోట న్యాయం త్వరగా చేరుతుంది.”

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more