-- --

16వ వార్డులో ఎస్‌ఐఆర్ ప్రత్యేక కార్యక్రమం – ఓటరు వివరాల సవరణకు అవకాశం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూలై 7:

బోధన్ పట్టణంలోని 16వ వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ శ్రీమతి మద్దెల దివ్య సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జూలై 6 నుంచి 9 వరకు ప్రతిరోజూ రంగర్ గల్లీ పార్క్‌లో కొనసాగుతుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతకు ఓటరు హక్కు కల్పించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఓటర్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

16వ వార్డుకు చెందిన అర్హులైన ఓటర్లందరూ అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ శ్రీమతి మద్దెల దివ్య సంతోష్ కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more