“ఐక్యతే బలం… హక్కుల సాధనకు అదే విజయపథం.”
బోధన్, జూలై 7:
బోధన్ పట్టణంలోని బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో మేడి పాపన్న ఆధ్వర్యంలో 33వ ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించిన నాయకులు, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన, మాదిగల అభ్యున్నతి కోసం ఉద్యమ స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మందుగుల విద్యాసాగర్, అద్దంకి లింగన్న, వీరపురం పోశెట్టి, పల్లెపోగు రమేష్, కనకరాజు, రాజు మల్లయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం మరింత బలోపేతమై సామాజిక సమానత్వం సాధించే వరకు పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలు “జై మాదిగ – జై జై మాదిగ”, “ఎమ్మార్పీఎస్ వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని చాటారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







