“హక్కుల కోసం సాగిన ఉద్యమమే… సమానత్వ సమాజానికి శాశ్వత పునాది.”
సాలూరు, నిజామాబాద్ జిల్లా: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను సాలూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు.
వక్తలు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమాన హక్కులు, ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సంస్థ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







