June 26, 2026 12:28 am

V1News Telangana

బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారుల ఉపాధి సంక్షోభం – ప్రభుత్వ సహాయం కోరుతూ ఆర్డీఓకు వినతి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూన్ 25:

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ స్వర్ణకారుల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొంటూ బోధన్ పట్టణ స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు ఆర్డీఓ విజయకుమారికి గురువారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు కొత్త ఆభరణాల కొనుగోళ్లకు దూరమవుతున్నారని, ఫలితంగా సాంప్రదాయ స్వర్ణకారుల వద్ద పనులు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయడంతో పాటు వడ్డీ రహిత రుణాలు, ఉపాధి ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం అందించి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీఓను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బొప్పాపురం హనుమాన్లు చారి, ప్రధాన కార్యదర్శి త్రివేణి నాగరాజు, కోశాధికారి మల్లేశ్వరం నారాయణ చారి, ఉపాధ్యక్షులు లింగోజు నరేంద్ర చారి, కే. బాలాజీ చారి, భాస్కర్ చారి, వెంకటేశం చారి, కే. సత్యనారాయణ చారి, ఎం. నరేష్ చారి, కే. రమేష్ చారి, ఏ. బాలరాజు చారి, శేఖర్ చారి, ఎస్. శంకర్ చారి తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more