6వ వార్డులో బీఎల్ఓల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, మొబైల్ యాప్‌లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో..
బోధన్, జూన్ 25:
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రారంభమైన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను బోధన్ ఆర్డీవో విజయకుమారి క్షుణ్ణంగా పరిశీలించారు. బోధన్ అర్బన్ పరిధిలోని 6వ వార్డును బోధన్ తహసీల్దార్‌తో కలిసి సందర్శించిన ఆమె, బూత్‌ల వారీగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల సేకరణ, ఫారాల పంపిణీ కార్యక్రమాలపై ఆర్డీవో ఆరా తీశారు. అనంతరం ఒక కుటుంబానికి చెందిన ఓటర్ల వివరాలను మొబైల్ యాప్ ద్వారా మ్యాపింగ్ చేసే ప్రక్రియను తమ సమక్షంలో పూర్తి చేయించి పరిశీలించారు.
అలాగే సంబంధిత కుటుంబ సభ్యులకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, వాటిని సక్రమంగా నింపి బీఎల్ఓలకు అందించాలని సూచించారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రతి ఓటరు సహకరించాలని ఆర్డీవో కోరారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, బీఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







