Post Views: 108
పాఠశాల ఆవరణ శుభ్రపరిచి, సొంత ఖర్చులతో భవనానికి రంగులు వేయించిన యువకులు.
సాలూరు, జూన్ 15:
నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం జాడి జమాల్పూర్ గ్రామ యువత నూతన విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువకులు ప్రభుత్వ పాఠశాల ఆవరణను శుభ్రపరచడంతో పాటు సొంత ఖర్చులతో పాఠశాల భవనానికి రంగులు వేయించి గ్రామానికి ఆదర్శంగా నిలిచారు.
గ్రామ అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, గ్రామ ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. ఈ సేవా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోగినేని జ్యోతి నరేంద్రబాబు, ఉప సర్పంచ్ యాపారు శ్రావణ్, పీఏసీఎస్ చైర్మన్ దాసరి అంతయ్య, వార్డు సభ్యులు కోలి నరేష్, ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, అంగన్‌వాడీ టీచర్లు చంద్రకళ, రాజ్యలక్ష్మి, గ్రామ పెద్దలు గోగినేని రాజేంద్రప్రసాద్, గురు బ్రహ్మం, వాసు, అశోక్, ప్రతాప్ తదితరులు పాల్గొని యువతను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్, గోపి, శ్యాం నాయుడు, మహేష్, శ్రీకాంత్, చిక్కు, నరేష్, రవి తదితర యువకులు కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామంలోని ఇతర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని గ్రామస్థులు పేర్కొన్నారు.
“మన ఊరు – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తే గ్రామాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








