డీఈఓకు వినతిపత్రం అందజేసిన పీడీఎస్‌యూ జిల్లా కమిటీ
నిజామాబాద్, జూన్ 10:
జిల్లా వ్యాప్తంగా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కమిటీ విద్యాశాఖ అధికారులను కోరింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు బుధవారం వినతిపత్రం సమర్పించినట్లు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సతీష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. పాఠశాలల ఆవరణలోనే పుస్తకాలు, నోట్‌బుక్లు, యూనిఫాంలు, బూట్లు, టైలు, బెల్టులు తదితర విద్యా సామగ్రిని విక్రయిస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లోనే విద్యా సామగ్రి విక్రయించడం ద్వారా యాజమాన్యాలు అక్రమంగా లాభాలు పొందుతున్నాయని ఆయన విమర్శించారు. విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల్లో పారదర్శకతను నెలకొల్పడంతో పాటు, తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం పడకుండా చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ జిల్లా కమిటీ కోరింది. :::
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








