May 28, 2026 1:43 am

V1News Telangana

పట్టణంలో పోలీసుల పహారా…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ లో బక్రీద్ సందర్భంగా ప్రధాన రహదారుల్లో పహారా..

బోధన్ మే 27 : బక్రీద్ పండగ సందర్భంగా బోధన్ పట్టణంలో శాంతి భద్రతల నేపథ్యంలో సీఐ వేంకట నారాయణ ప్రధాన రహదారులు, వీక్లీ మార్కెట్ ప్రాంతాలు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విస్తృత పహారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మనోజ్ కుమార్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పండగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో కూడా పహారా మరింత పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భద్రతా భావన నెలకొంది.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more
Read more