బోధన్, నిజామాబాద్ జిల్లా:
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్‌గాహ్ వద్ద నిర్వహించిన పార్సెల్ పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్లు దామన్న, సరిత అన్నగారు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ నమాజ్‌కు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

అనంతరం పండుగ సందర్భంగా అవసరమైన కుటుంబాలకు పార్సెల్‌లను పంపిణీ చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







