Post Views: 99
ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేత – హనుమాన్ చాలీసా నేర్చుకోవాలని పిలుపు..
బోధన్, మే 27:
బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు చిన్నారులను ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ అభినందించి, వారికి ఎగ్జామ్ ప్యాడ్‌లు, స్కేల్‌లు, పెన్నులను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో గాయత్రి ఇడ్లీ సెంటర్ గంగాధర్, విజయ గురుస్వామి, కె. దత్తాత్రి, రవికాంత్, సిరిగిరి నాగనాథ్, రమేష్, బద్ధం సత్యనారాయణతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతిభ కనబరిచే ప్రతి చిన్నారిని ఆలయం తరఫున ప్రోత్సహించి బహుమతులు అందజేస్తామని తెలిపారు. పిల్లలందరూ ఆసక్తితో హనుమాన్ చాలీసా నేర్చుకుని తమ ప్రతిభను చాటాలని కోరారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








