May 26, 2026 12:37 am

V1News Telangana

బోధన్ ఆర్డీవో కార్యాలయంలో “డివిజనల్ ప్రజాపాలన” కార్యక్రమం నిర్వహణ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు “డివిజనల్ ప్రజాపాలన” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి శ్రీ పి. వెంకటేష్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన డివిజనల్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.


ఈ సందర్భంగా భూ సమస్యలు, నీటి పైప్‌లైన్ సమస్య, రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన వేతనాల సమస్య, డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్య, విద్యాశాఖ పరిధిలో ఒక విద్యార్థి అడ్మిషన్ సమస్య, వయోవృద్ధుల పెన్షన్ సమస్య తదితర అంశాలపై మొత్తం 9 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురాగా, ఆయా శాఖల అధికారులు వాటిని పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more