బోధన్, మార్చి 7:
శ్రీ కాకతీయ చేయూత చారిటబుల్ ట్రస్ట్, బోధన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సన్మాన కార్యక్రమానికి ట్రస్ట్ గౌరవ సభ్యులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి న్యాయ సలహాదారులు, ప్రస్తుతం సుప్రీంకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ కనకమేడల రవీంద్రకుమార్ గారు ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి 2026 మార్చి 7వ తేదీ ఉదయం 10:30 గంటలకు శ్రీ కాకతీయ చేయూత చారిటబుల్ ట్రస్ట్, బోధన్‌కు విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ కనకమేడల రవీంద్రకుమార్ గారిని ఘనంగా సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసక్తి గల ట్రస్ట్ సభ్యులు, గౌరవ సభ్యులు సమయానికి హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







