May 26, 2026 12:41 am

V1News Telangana

భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ముగిసిన సాలూర అఖండ హరినామ సప్తాహం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర, మే 25:
సాలూర గ్రామంలో నిర్వహించిన అఖండ హరినామ సప్తాహం సోమవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ముగిసింది. వారంరోజుల పాటు కొనసాగిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


ఈ సందర్భంగా తుకారం మహారాజ్ మాట్లాడుతూ, సాలూర గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన ఈ అఖండ హరినామ సప్తాహానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. మొదటి సంవత్సరమే అయినప్పటికీ గ్రామ ప్రజలు ఎంతో భక్తి భావంతో పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
సప్తాహం సందర్భంగా ప్రతిరోజూ భజనలు, హరినామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా గ్రామం మొత్తం భక్తిమయ వాతావరణంలో మునిగిపోయింది. భక్తుల గోవింద నామస్మరణలు, ఆధ్యాత్మిక సందేశాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సప్తాహం ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేశారు.
కార్యక్రమం విజయవంతానికి సహకరించిన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలకు తుకారం మహారాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“భక్తి మార్గమే మనిషికి శాంతి, సౌఖ్యం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తుందని” ఈ సందర్భంగా పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more