బోధన్ శక్కర్‌నగర్‌లోని మధు మలాంచ హైస్కూల్‌లో ఉర్దూను ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించడం లేదా ఇతర భాషలను ఎంచుకోవాలని ఒత్తిడి చేయడం ఆందోళనకరమని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ పేర్కొన్నారు.

ఉర్దూ మాట్లాడే విద్యార్థులు భాషాపరమైన మైనారిటీలకు చెందినవారని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29(1) ప్రకారం తమ భాష, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు వారికి ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆర్టికల్ 30(1) ప్రకారం మైనారిటీల విద్యా హక్కులు రక్షించబడినవని గుర్తు చేశారు.
ఉర్దూ ఉపాధ్యాయులు లేరనే కారణంతో విద్యార్థులను బలవంతంగా ఇతర భాషలను ఎంపిక చేసుకోవాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ అంశంపై బోధన్ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఉర్దూను ఫస్ట్ లాంగ్వేజ్‌గా తీసుకోవాలనుకునే విద్యార్థులకు వెంటనే అడ్మిషన్లు కల్పించాలని, ఇతర భాషలను బలవంతంగా ఎంపిక చేయించకూడదని, అవసరమైతే ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని సంబంధిత అధికారులను కోరారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకుని విద్యార్థుల భాషా హక్కులను పరిరక్షించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ డిమాండ్ చేశారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







