నిజామాబాద్, మే 17 : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చీత ఫోర్స్ బృందాలు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.

ఆదివారం పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాల మేరకు సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ శ్రీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ సిబ్బంది వెల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 14 టైర్ల భారీ లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో లారీ ద్వారా ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే వాహనాన్ని నిలిపివేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. అనంతరం పట్టుబడిన లారీని తదుపరి చట్టపరమైన చర్యల కోసం వెల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా వంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చర్యల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
జిల్లాలో సహజ వనరుల సంరక్షణతో పాటు అక్రమ వ్యాపారాల నియంత్రణకు చీత ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.
– పోలీస్ పి.ఆర్.ఓ
పోలీస్ కమిషనర్ కార్యాలయం, నిజామాబాద్
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








