May 18, 2026 11:30 am

V1News Telangana

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నిరసన

బోధన్, మే 17 : పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆదివారం బోధన్ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ ఎదుట సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తప్పిదాల వల్లే దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడుతోందని తీవ్రంగా విమర్శించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను రక్షించిందని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకున్నప్పటికీ, ప్రస్తుతం ధరలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు.

దేశంలో తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని, సరఫరా సమస్యలను అధిగమిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల ప్రచారాల కోసం భారీ స్థాయిలో పర్యటనలు, సభలు నిర్వహిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, ఏఐపీకేఎస్ జిల్లా నాయకుడు సిహెచ్ రమేష్, పిఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, జిల్లా నాయకురాలు బీపాషా బేగం, టీయూసీఐ నాయకులు రెహానా బేగం, సునీత, ఎస్.కే. కాజా, బి. శంకర్, బి. సాయిలు, కే. పోశెట్టి, సలీం, గౌస్, బాబు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more