May 17, 2026 11:23 am

V1News Telangana

టౌన్-6 పరిధిలో పేకాట స్థావరంపై చీత ఫోర్స్ మెరుపు దాడి ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్ – నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్, మే 16:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా టౌన్-6 పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీత ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు.

Oplus_16908288

గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో, సి.సి.ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ బృందం శనివారం జిల్లా జైలు సమీపంలోని సారంగాపూర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి నిర్వహించగా, కొందరు వ్యక్తులు బహిరంగంగా పేకాట ఆడుతూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా, మొత్తం ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
దాడి సందర్భంగా నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ.12,530 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం టౌన్-6 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో పేకాట, గుట్కా, గంజాయి, డ్రగ్స్ తదితర అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో పేకాట, గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more