నిజామాబాద్, మే 16 (ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై గంజాయి, డ్రగ్స్ వినియోగదారులు, అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన నిందితులు, రౌడీషీటర్లు మరియు అనుమానితులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలు ఆర్థికంగా మరియు సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ఆరోగ్యపరంగా ప్రమాదకరమే కాకుండా చట్టపరంగా కూడా తీవ్రమైన నేరమని హెచ్చరించారు.
గతంలో కేసుల్లో నమోదైన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకుని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించిన ఆయన, మళ్లీ ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా మరియు వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు మరియు ప్రజా ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి మరియు కుటుంబ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని కోరారు.
అనంతరం ఈగల్ టీం మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు చేపట్టారు. పరీక్షల్లో కొంతమంది వ్యక్తులకు డ్రగ్స్ వినియోగం పాజిటివ్‌గా తేలడంతో వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్) రామ్ చందర్రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈగల్ టీం డీఎస్పీ ఎం. సోమనాథం, హోమ్ గార్డ్ ఏసీపీ కె. దీపక్ చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస రాజ్, సౌత్ రూరల్ సీఐ ఎన్. సురేష్ కుమార్, నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్, డిచ్‌పల్లి సీఐ కె. వినోద్, ధర్పల్లి సీఐ బిక్షపతి, ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







