May 14, 2026 3:03 am

V1News Telangana

ప్రభుత్వ విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం అవసరం బోధన్‌లో సర్పంచులు, వార్డు సభ్యులకు అవగాహన కార్యక్రమం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, మే 13 (వి1 ప్రతినిధి):
“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక – విద్యా వారోత్సవాలు” కార్యక్రమాలలో భాగంగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులకు అవగాహన కార్యక్రమం బుధవారం బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించినట్లు మండల విద్యాధికారి శ్రీ నాగయ్య తెలిపారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎల్‌పీఓ శ్రీ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ విద్య లక్ష్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, డిజిటల్ విద్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్యా విధానం, సమాజాభివృద్ధిలో విద్య ప్రాధాన్యతపై ఆయన విపులంగా వివరించారు.
అనంతరం మండల విద్యాధికారి శ్రీ నాగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అనేక సంక్షేమ, విద్యా కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, రెండు జతల యూనిఫార్ములు, మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వారానికి మూడు రోజుల పాటు రాగిజావ, మూడు రోజుల పాటు ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏఎల్‌ఎమ్ ల్యాబ్‌లు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమం, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎల్‌ఈపీ, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం, ఏఐ ఆధారిత విద్యా విధానాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత అభ్యసన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహిస్తున్నామని, ప్రతి రెండు నెలలకు ఒకసారి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించి విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలల సుందరీకరణ, త్రాగునీటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బోధన్ పట్టణ సీఐ శ్రీ వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, బాలల భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీడీవో, సాలూరు మండల ఎంపీడీవో, రంజల్ మండల ఎంపీఓలు, బోధన్, ఎడపల్లి, నవీపేట్, సాలూరు మండలాల సీఆర్‌పీలు, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

1. గుట్కాపై చీత ఫోర్స్ దాడులు 2. మహారాణా ప్రతాప్ జయంతి ఘనంగా 3. ఉపాధి కోసం వెళ్ళిన వారిపై అప్రమత్తత 4. ఈత చెట్లు విధ్వంసంపై గీత కార్మికుల ఆవేదన 5. రైతు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ 6. “మన ఊరు – మన భద్రత” అవగాహన కార్యక్రమం

Read more

1. గుట్కాపై చీత ఫోర్స్ దాడులు 2. మహారాణా ప్రతాప్ జయంతి ఘనంగా 3. ఉపాధి కోసం వెళ్ళిన వారిపై అప్రమత్తత 4. ఈత చెట్లు విధ్వంసంపై గీత కార్మికుల ఆవేదన 5. రైతు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ 6. “మన ఊరు – మన భద్రత” అవగాహన కార్యక్రమం