కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్తున్న బంధువుల కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన చిదుర సిద్ధిరాములు కుమారుడు చిదుర భరత్ వివాహం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వరుడి తల్లిదండ్రులు, సోదరి, చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది కారులో వివాహ వేడుకకు బయలుదేరారు.
చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకున్న సమయంలో కారు వేగంగా వెళ్లి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న అందరికీ గాయాలు కాగా, వరుడి తల్లిదండ్రులు వినోద, సిద్ధిరాములకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఉండగా, కారు దానిని ఢీకొనకుండా తప్పించుకోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
పెళ్లి వేడుకకు ఆనందంగా వెళ్తున్న కుటుంబం ప్రమాదానికి గురికావడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








