April 20, 2026 9:38 pm

V1News Telangana

వర్ని మండలంలో వివాదం: జేసీబీతో ఇల్లు కూల్చివేత, ఇద్దరికి గాయాలు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చింతల్‌పేట్ తండాలో ఇల్లు కూల్చివేత ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికుడు జోహార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రేమ్ సింగ్‌తో పాటు కొంతమంది వ్యక్తులు కక్షపూరితంగా జేసీబీ యంత్రంతో తమ ఇంటిని కూల్చివేశారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ప్రశ్నించగా, తన తండ్రి మాజీ జెడ్పిటిసి హరిదాస్‌పై దాడి జరిగిందని, అడ్డుకోవడానికి వచ్చిన తన అత్త భానీ భాయ్‌పైనా దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో హరిదాస్ మరియు భానీ భాయ్ తీవ్రంగా గాయపడగా, భానీ భాయ్‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ్ సింగ్ మరియు అతనికి సంబంధించిన వ్యక్తులు తమను మానసికంగా వేధిస్తున్నారని, రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారని జోహార్ సింగ్ ఆరోపించారు. ఇటీవల భూమి కొనుగోలు వ్యవహారంలో కూడా సమస్యలు తలెత్తాయని, డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
ఇదే విషయంపై ప్రేమ్ సింగ్ స్పందిస్తూ, కూల్చివేసిన నిర్మాణం వారి ఇల్లు కాదని, అది రోడ్డుపై అక్రమంగా నిర్మించిన బాత్రూమ్ అని తెలిపారు. పలుమార్లు చెప్పినా వినకపోవడంతో జేసీబీతో కూల్చివేసినట్లు చెప్పారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారుల జోక్యం కోరుతూ బాధితులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more