Post Views: 311
. విద్యార్థిపై చిత్రహింసలు – తండ్రి ఫిర్యాదు
బీటీ నగర్ కాలనీ పాఠశాలలో మాస్టర్ చేతిలో బాలుడు హింసకు గురయ్యాడా?
బోధన్, సెప్టెంబర్ :
నిజామాబాదు జిల్లా బోధన్ మండలం బీటీ నగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేసి, చిత్రహింసలు పెట్టినట్లు తండ్రి ఆరోపించారు. విద్యార్థి తండ్రి రాజేందర్ వివరాల ప్రకారం, తన కుమారుడిని మాస్టర్ తీవ్రంగా కొట్టి వేధించాడని, తాను కాళ్లు మొక్కినా కూడా ఉపాధ్యాయుడు కనికరించలేదని తెలిపారు.
ఇకపై ఇలా చేయవద్దని వినతి పత్రాలు ఎంఈఓ, డీఈఓలతో పాటు జిల్లా కలెక్టర్‌కు రెండు సార్లు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. అంతేకాకుండా, ఉపాధ్యాయ సంఘం సభ్యులు తమను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రాజేందర్ న్యాయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








