June 17, 2026 3:45 am

V1News Telangana

వరదలు వచ్చిన ఆగని ఇసుక దందా – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ప్రశ్నల వర్షం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నంబర్ ప్లేట్లు లేని ట్రాలీ ఆటోలు.. అనుమతులు లేని రవాణా.. ఎవరికి లాభం?

 మంజీరా నుంచి ఇసుక దోపిడీ.. ప్రజల కేకలు వినని అధికారులు!

. అక్రమ ఇసుక రవాణా బహిరంగంగానే.. కానీ చర్యలు మాత్రం జీరో..‌

 

oplus_8388610
బోధన్ పట్టణం పరిధి నుంచి మండలంలోని గ్రామాలకు రోజూ ట్రాలీ ఆటోలలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూనే ఉంది. అయితే దీనిపై అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రగల్చుతోంది.

 

oplus_2
మందర్నా మంజీరా నది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ట్రాలీ ఆటోల ద్వారా తరలిస్తుంటే ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారింది. ఈ ట్రాలీలకు బ్యాచ్ నెంబర్లు లేవు, నంబర్ ప్లేట్లు లేవు,    లేవు.  

“ఉదయం నుంచి రాత్రి వరకూ నంబర్ ప్లేట్ల లేని ఆటోలు బహిరంగంగానే ఇసుకను తరలిస్తున్నాయి. వీరి వెనుక ఎవరి ఆశీర్వాదం ఉందో? ఎవరికి లాభం చేకూరుతోందో?” అంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మామూలు వసూళ్లకే అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

oplus_8388610
ఇప్పటికైనా అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు..
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more