వి1 న్యూస్, నిర్మల్ జిల్లా – దిలావర్పూర్ మండలం:
దిలావర్పూర్ మండలంలోని కండెల గ్రామంలో ఆదివారం గంగాపుత్ర సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.ఏ. లతీఫ్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన గ్రామ అభివృద్ధికి మరియు ప్రజల పట్ల చూపించిన సేవా దృక్పథాన్ని గుర్తించి ఈ సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ, “కరోనా సమయంలో నేను అందించిన సేవలను మీరంతా గుర్తుంచుకోవడం నాకు గర్వంగా ఉంది. పాఠశాలల యందు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశాను. నేను ఉన్నది మీకోసం. జీవితం మొత్తానికీ మీ సేవలో ఉండాలని నిశ్చయించుకున్నాను,” అని అన్నారు.
అలాగే, “మీ ఆశీర్వాదం నాకు రాజకీయంగా బలంగా నిలబడే ధైర్యాన్ని ఇస్తోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గంగాపుత్ర సంఘం గొంతుగా వినిపిస్తాను. ఈ సంవత్సరం టెంటును కానుకగా అందించినందుకు గంగాపుత్ర సంఘానికి ధన్యవాదాలు,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘానికి చెందిన భోజన్న, సాయినాథ్, ముత్యం సాయికృష్ణ, గంగాధర్, సూర్యకాంత్, శ్రీనివాస్, సాయిరాం, భాస్కర్, శరత్, దేవన్న, మచందర్ తదితరులు పాల్గొన్నారు. కండెల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ ఘన సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








