హైవేపై భారీ దొంగతనం.. రూ.10 లక్షల విలువైన సెల్ ఫోన్లు గాలిలోకి..
. నిజామాబాద్ జాతీయ రహదారిపై లారీ నుంచి సెల్ ఫోన్ల దోపిడీ…
. శనివారం తెల్లవారుజామున హైవేపై సంచలనం.. లారీ నుంచి మొబైల్ ఫోన్లు మాయం…
విశ్రాంతి తీసుకున్న డ్రైవర్.. విజిలెంట్ దొంగలు..,
. హైవేపై సెల్ ఫోన్ల బాక్సులు మాయం.. పోలీసుల విచారణ ప్రారంభం…
వి 1 న్యూస్.నిజామాబాద్ (జులై 12): జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ దొంగతనం సంచలనంగా మారింది. విశ్రాంతి కోసం రహదారి పక్కన ఆపిన ఓ లారీ నుండి దొంగలు లక్షల విలువ గల సెల్‌ఫోన్ల పెట్టెలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, అతను స్వల్ప విరామం కోసం లారీని జాతీయ రహదారి పక్కన నిలిపాడు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు లారీని లక్ష్యంగా చేసుకొని, అందులో లోడ్ చేసిన మొబైల్ ఫోన్ల బాక్సులను అపహరించారని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మొబైల్ ఫోన్ల అంచనా విలువ మార్కెట్ రేటు ప్రకారం సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ పోలీసులకు వివరించాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రధాన రహదారిపై ఇలా భారీ చోరీ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








