V1News Telangana

best news portal development company in india

పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల ఐఐటీ బాసర విజిట్ – ప్రయోగాత్మక విద్యకు నూతన దిశ..

SHARE:

.వి 1 న్యూస్.సాలూర, జూలై 11:-పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరా విద్యార్థులు, పి.ఎం.సి ట్వినింగ్ కార్యక్రమంలో 一 భాగంగా ఈరోజు బాసరలోని ప్రసిద్ధ ఐఐటీ బాసర్ (RGUKT)ని సందర్శించారు. ఈ విద్యా యాత్రలో విద్యార్థులు రసాయనశాస్త్ర (కెమిస్ట్రీ) ల్యాబ్, భౌతిక శాస్త్ర (ఫిజిక్స్) ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ వంటి విభాగాలను ఆసక్తిగా పరిశీలించారు.కెమిస్ట్రీ ల్యాబ్ లో ల్యాబ్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ శ్రీనివాస్ భోగ గారు విద్యార్థులకు రసాయనిక మార్పులు, ఆమ్లాలు-క్షారాల గుర్తింపు వంటి ప్రాథమిక ప్రయోగాలను ప్రత్యక్షంగా చూపించారు. భౌతిక శాస్త్ర విభాగంలో హెచ్ఓడి దేవరాజ్ సార్ గారి నేతృత్వంలో విద్యార్థులు ప్రయోగపూరితంగా భౌతిక ప్రక్రియలను అర్థం చేసుకున్నారు.కార్యక్రమంలో డీన్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డాక్టర్ విఠల్ గారు ముందుండి వ్యవస్థాపక పాత్ర పోషించారు. యూనివర్సిటీ ఓ.ఎస్.డి శ్రీ ఈ. మురళీధరన్ గారు విద్యార్థులకు ఐఐటీ బాసర్ లో అందుబాటులో ఉన్న విద్యా వనరులు, అవకాశాలను వివరించారు.

ముఖ్యంగా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శ్రీ ఏ. గోవర్ధన్ గారు విద్యార్థులతో సమావేశమై, ప్రభుత్వ పాఠశాలలలో చదివిన తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో చెప్పి వారిని ప్రోత్సహించారు. విద్యార్థులు క్రమశిక్షణగా, పట్టుదలతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ విజిట్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాజీమంజుష గారు, ఉపాధ్యాయులు శ్రీ పురాణే విజయ్ కుమార్, శ్రీమతి లింబగిరి జోష్ణ, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ రుద్ర సంతోష్ యాదవ్, శ్రీ కాంబ్లే విట్టల్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ విద్యా యాత్ర ద్వారా విద్యార్థులకు పరిశోధన పట్ల ఆసక్తి పెరగడం ఖాయం అని ఉపాధ్యాయులు వ్యక్తీకరించారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india