పోలీస్ కమీషనర్ ఆదేశాలపై టాస్క్ ఫోర్స్ గట్టిదెబ్బ..
మద్యం విందులపై ఉక్కుపాదం – ఇద్దరు ఢాబా యజమానులు అరెస్ట్..
. హైవే ఢాబాల్లో మద్యం సేవనానికి లైసెన్స్ లేనందున కఠిన చర్యలు: పోలీస్ కమిషనరేట్….
వి1 న్యూస్.నిజామాబాద్, జూలై 10:పర్మిషన్ లేకుండా నేషనల్ హైవే దాబాల్లో మద్యం సేవకు అవకాశం కల్పిస్తున్న ఢాబాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య IPS గారు ఒక ప్రకటనలో వెల్లడించారు.కమీషనర్ గారి ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్‌ఐ గోవింద్ తదితర సిబ్బంది సహకారంతో మోర్తాడ్ మరియు వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ప్రముఖ ఢాబాలపై ఈ దాడులు నిర్వహించారు.
1. మోర్తాడ్ – RNM దాబా:
మోర్తాడ్ పరిధిలోని RNM దాబా హోటల్‌లో మద్యం సిట్టింగ్‌కు అనుమతించడాన్ని గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి టీచర్స్ 750ml – 1 బాటిల్, మ్యాగ్నం ఐకానిక్ లిక్కర్ – 1 బాటిల్, కింగ్ ప్రెషర్ బీర్ – 1 బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. దాబా యజమాని రొయ్యల నాగభూషణంను అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మోర్తాడ్ SHOకు అప్పగించారు.
2. వేల్పూర్ – మయూరి దాబా:

వేల్పూర్ పరిధిలోని మయూరి దాబాలోనూ పర్మిషన్ లేకుండా మద్యం సేవనానికి వీలు కల్పించడాన్ని గుర్తించిన పోలీసులు అక్కడ టీచర్స్ 750ml – 1 బాటిల్, 100 పేపర్ 750ml – 1 బాటిల్, కింగ్ ప్రెషర్ బీర్ – 1 బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. దాబా యజమాని అగ్గు మైపాల్ను అదుపులోకి తీసుకుని, సీజ్ చేసిన మద్యాన్ని వేల్పూర్ SHOకు అప్పగించారు.
కమీషనర్ హెచ్చరిక:
ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించనున్నట్లు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య గారు హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని, లైసెన్స్ లేకుండా మద్యం సిట్టింగ్‌కు అవకాశం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









