బోధన్, జూన్ 8:
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజనల్ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తమ వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మొత్తం ఆరు దరఖాస్తులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

ప్రజావాణిలో పాల్గొన్న బాధితులు రేషన్ కార్డుల జారీ, సవరణలకు సంబంధించిన సమస్యలు, ఆన్‌లైన్ ఇసుక బుకింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులు, భూ వివాదాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చెల్లింపుల సమస్యలు, భూముల మార్కెట్ విలువ నిర్ణయానికి సంబంధించిన అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.
అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని వేదికగా ఉపయోగిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








