ఈరోజు కుంటాల మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సుకి ముఖ్యఅతిధులుగా విచ్చేసిన *తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయురాలు సీతక్క గారికి ఘన స్వాగతం పలికిన ముధో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ విఠల్ రెడ్డి గారు .*
భూ భారతి చట్టం ఒక చారిత్రాత్మకం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు మన రాష్ట్ర క్యాబినెట్ *మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో చేయటం జరిగింది. ముఖ్యంగా BC కులగణన మరియు భూభారతి చట్టం ఇంకా ఎన్నో నిర్ణయాలు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మన రాష్ట్రంలో చేయడం జరిగింది. భూభారతి చట్టానికి వస్తే *గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రెవెన్యూ శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు* క్యాబినెట్ మంత్రులతో కలిసి ఎన్నో రోజులు దీనిపై చర్చించి నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ఈ చట్టాన్ని రూపొందించారు. అదేవిధంగా మహిళలకు కూడా *మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయురాలు సీతక్క గారి ఆధ్వర్యంలో* ఎన్నో సంక్షేమ పథకాలు మహిళా సోదరీమణుల కోసం చేయడం జరిగింది.
ఈ భూభారతి కొత్త చట్టం వలన వ్యవసాయ భూముల విషయంలో వ్యవసాయం చేసే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రోజు తాసిల్దార్ కార్యాలయాలు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒకసారి దరఖాస్తు ఇస్తే దానిని అమలు చేసేందుకు రెవెన్యూ అధికారులకు హక్కులు కల్పించారు. ఏ అధికారి అయిన తప్పు చేస్తే ఆ విషయంలో కోర్టుకు వెళ్లకుండా పై అధికారి దగ్గర ఆ సమస్యను సరిదిద్దటానికి అవకాశం కల్పించారు. కొన్న తర్వాత పట్టా మ్యూటిషన్ కొరకు , వారసత్వ బదిలీల కోసం , ఇతర మార్పిడీల కోసం భూభారతి చట్టంలోనే అవకాశం కల్పించారు. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా ప్రత్యేక ట్రిబ్యునల్ ను కూడా ఏర్పాటు చేశారు.
భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని మా ముధోల్ నియోజకవర్గంలో కుంటాల మండలo లో కానీ ఇతర మండలంలో కానీ కెనాల్ కోసం రోడ్ల కోసం రైతుల భూములు ప్రభుత్వం తీసుకొని కెనాల్ కట్టారు రోడ్లు వేశారు కానీ ఉదాహరణ కు ఒక రైతు 5 ఎకరాల పట్టేధర్ అ రైతుది ఒక ఎకరమే ప్రభుత్వం తీసుకున్నది కానీ రికార్డు లలో ఒక ఎకరం బదులు 5 ఎకరాలు రికార్డ్ లలో చూయించారు అరైతుకు రైతు బంధు రావటం లేదు అమ్ముదాం అన్న కుటుంబ సభ్యలకు పట్టా చేసి ఇవ్వాలన్న రిజెస్టేషన్ కార్యాలయం లో ప్రభుత్వ భూమి గ ఉన్నందున రైతులు ఎంతో ఇబ్బందిలో ఉన్నారు.

ప్రభుత్వ భూములలో ( లవని పట్టా గల భూములలో కొందరు, ST SC వారు మరియు ఇతర బిదాస్థులు చాలకాలం నుండి కబ్జా లో ఉండి పంటలు తీసుకుంటాన్నారు వారికీ లవని పట్టాలు ఇవ్వాలని కోరానైనాది.
సదా బైనామా ల కింద SC ST మరియు బిదా రైతులు భూమి కొనటం జరిగింది. కబ్జా లో ఉన్నారు. అ సదా బైనామా ల ప్రకారం వారికీ పట్టాలు చేయాలనీ కోరానైనాది.
బాసర పుణ్యక్షేత్రం లో SRSP అధీనం లో సుమారు 300 ఎకరాలు ఉన్నవి. ఇంతకు ముందు SRSP ప్రాజెక్ట్ కట్టినపుడు 1971 నుండి 1985 వరకు SRSP వారు రైతులకు నష్ట పరిహారం ఇచ్చి భూములు అధీనం చేసుకున్నారు. అ భూముల నుండి 20 ఎకరాల వరకు తీసుకొని అక్కడ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలనీ కోరానైనాది. దీని కొరకు కుబీర్ మండలం జామగాం లో కూడా ప్రభుత్వ భూమి 20 ఎకరాల వరకు కలదు ప్రభుత్వం వారికీ ఏది అనుకూలంగా భావిస్తే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరడమైనది .
మన ముధోల్ నియోజకవర్గంలోని ఏడు తహసిల్దార్ కార్యాలయాల్లో మూడు భావనలు మాత్రమే మాత్రమే కొత్తగా ఉన్నవి అని మిగిలిన నాలుగు కూడా కొత్భావనలు nమంజూరు చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముధోని నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్వర్డ్ అయినందున ఎస్సీ ఎస్టీ సోదరులు, BC లు మరియు మైనార్టీ లు జనాభా ఎక్కువ ఉన్నందున అదనంగా SR కోటా కింద ఇంకో 2000 ఇండ్లు మంజూరు చేయాలని మెమోరాండం ద్వారా కోరడం జరిగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








