V1News Telangana

best news portal development company in india

రామగుండంను మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి సింగరేణి , ఎన్ టి పి సి , ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం సహకరించాలని శాసన సభ్యులు ఎం ఎస్, రాజ్ ఠాకూర్ కోరారు

SHARE:

రామగుండంను మరింత సుందర నగరంగా తీర్చిదిద్దడానికి సింగరేణి , ఎన్ టి పి సి , ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం సహకరించాలని శాసన సభ్యులు ఎం ఎస్, రాజ్ ఠాకూర్ కోరారు

V1 న్యూస్ తెలంగాణ రామగుండం ప్రతినిధి మార్చ్ 31:హ

రామగుండంను సుందర నగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని శాసన సభ్యులు ఎం ఎస్, రాజ్ ఠాకూర్ సింగరేణి , ఎన్ టి పి సి , ఆర్ ఎఫ్ సి ఎల్ , మున్సిపల్ అధికారులను కోరారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనుల పురోగతిపై పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు , కమిషనర్ ఎఫ్ ఎ సి  జె. అరుణ శ్రీతో కలిసి రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. అభివృద్ది పనులకు నిధుల కొరత రాకుండా తాను చూసుకుంటటానని అధికారులు పనుల్లో వేగం పెంచాలని అన్నారు. వేసవి కాలంలో కాలనీలలో నీటి ఎద్దడి ఏర్పడకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. రామగుండం నగరంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ , రోడ్లు నిర్మించడానికి డి పి ఆర్ తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రామగుండం పట్టణంలో రూ 200 కోట్ల అంచనా వ్యయంతో 27 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. ఫ్లై ఓవర్ , డబల్ రోడ్డు తో ఆ ప్రాంతం త్వరలో మరింత అభివృద్ది చెందుతుందని అన్నారు. రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు కూడా త్వరలో పూర్తి కానున్నoదున ఇరువైపులా లాండ్ స్కేపిoగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అన్నారు. 2 ఎ మోరీ , 5 ఇంక్ లైన్ మోరీ లను కలుపుతూ రోడ్డు నిర్మించాలని అన్నారు . ఈ రెండు వంతెనల వద్ద వర్షా కాలంలో నీళ్ళు నిలవకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన అన్ని చోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అన్నారు. శ్రీ రామ నవమి పురస్కరించుకొని కోదండ రామాలయం లో నిర్వహించే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. టి యు ఎఫ్ ఐ డి సి , 15 వ ఆర్థిక సంఘం నిధులు , అమృత్ తదితర పథకాలతో ప్రతిపాదించిన పనుల పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకట స్వామి , సింగరేణి ఆర్ జి వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ , ఆర్ ఎఫ్ సి ఎల్ డి జి ఎం రమేష్ ఠాకూర్ , సీనియర్ మేనేజర్ వెంకట రెడ్డి , సింగరేణి ఎస్ ఇ సివిల్ వర ప్రసాద్ , సీనియర్ ఇ ఓ లలిత , సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి , ఎన్ టి పి సి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్య నారాయణ , నగర పాలక సంస్థ ఇ ఇ రామన్ , వివిధ విభాగాల అధికారులు తాజా మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి , బొంతల రాజేష్ , ముస్తాఫా నాయకులు పాతపెల్లి ఎల్లయ్య , పెద్దెల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india