May 2, 2026 9:12 pm

V1News Telangana

పదవి విరమణ పొందిన బంగారు సారంగపాణి, సీనియర్ పిఒ ఘనంగా సన్మానించిన ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పదవి విరమణ పొందిన బంగారు సారంగపాణి, సీనియర్ పిఒ ఘనంగా సన్మానించిన ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 31:-

రామగుండం ఏరియా 1 జియం కార్యలయం పర్సనల్ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వహించి సోమవారం పదవి విరమణ పొందుతున్న బంగారు సారంగపాణి, సీనియర్ పిఒ రామగుండం ఏరియా -1 జియం కార్యలయం సమావేశ హాలులో ఆర్జీ. 1 జియం డి.లలిత్ కుమార్ పూలమాలలు మరియు శాలువాలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి చేసిన పనులను కొనియాడారు.ఈ సందర్భముగా జియం మాట్లాడుతూ వారు క్రమశిక్షణతో, స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందారని, పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం వివిధ డిపార్ట్ మెంట్ల అధికారులు కుటుంబ సభ్యులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జియం గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీర్ డి.వి.రావు, సి.ఎం.ఓ.ఐ ప్రతినిధి క్రాంతి, ఎఐటియుసి ప్రతినిది రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పిఒ హనుమంత రావు, శ్రవణ్, ఇతర అధికారులు కుమార స్వామి, ధన లక్ష్మి బాయి, సాయి ప్రసాద్, వీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more