V1News Telangana

best news portal development company in india

ఉత్తమ సేవలకు దక్కిన ఘన సత్కారం….

SHARE:

– వనితా నీకు వందనం.. మహిళా శిరోమణి 2025 అవార్డు స్వీకరణ

– మాజీ కేంద్రమంత్రి చేతులమీదుగా అందజేత

– విద్యా రంగంలో అందించిన ఉత్తమ సేవలకు గాను గుర్తింపు

– విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దడంలో పోషిస్తున్న తనదైన పాత్ర

– మహిళల ప్రాధాన్యతను గుర్తించి అవార్డు అందించడం పట్ల వ్యక్తం చేస్తున్న అవధులు లేని సంతోషం

– మల్లెపూల ఇందిర (స్కూల్ అసిస్టెంట్ జడ్.పి.హెచ్.ఎస్ నసురుల్లాబాద్)

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా” శిఖరం ఆర్ట్ థియేటర్స్”సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పదిమందిని ఎంపిక చేసి బుధవారం రోజు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక, చిక్కడపల్లి హైదరాబాద్ లో వారిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి సంగీత సారథ్యంలో సినీ సంగీత విభావరి, డా . కూరలి ప్రతిభా రాజ్ గౌడ్ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన, వివిధ సంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి విద్యారంగంలో ఆమె అందించిన ఉత్తమ సేవలను గుర్తించి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన మల్లెపూల ఇందిర స్కూల్ అసిస్టెంట్ జడ్.పి.హెచ్.ఎస్ నసురుల్లాబాద్ , ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి డా. సముద్రాల వేణుగోపాలచారి చేతుల మీదుగా” వనితా నీకు వందనం.. మహిళా శిరోమణి” 2025 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మరియు నిర్వాహకులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఉత్తమమైన సేవలు అందించిన మహిళలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా, గౌరవిస్తూ అవార్డులు ప్రధానోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.MSC ,MED ఉన్నత విద్యను హైదరాబాద్ లో అభ్యసించి.. కార్పోరేట్ సంస్థలలో మెరుగైన జీతభత్యాలను వదులుకొని మల్లెపూల ఇందిర ఆమె తనలో దాగి ఉన్న విద్య నైపుణ్యాన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ వారిని క్రమశిక్షణతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో పోషిస్తున్న పాత్ర గొప్పదని కొనియాడారు. విద్యార్థులతో ఒక స్నేహితురాలిగా, గురువుగా, శ్రేయోభిలాషి గా వారిని సన్మార్గంలో నడిపించే విధంగా ఆమె పడే తపన అమోఘం అని వర్ణించారు. నిబద్ధతతో వృత్తిని మరియు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థిని,విద్యార్థులకు ఆమె ఆర్థికంగా మరియు వస్త్రాలు, అవసరమైన వస్తువులు సహకారాలు అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు చదువులతోపాటు , సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ జీవితాలకు బంగారు బాటలు ఏ విధంగా వేసుకోవాలో అని వివరిస్తూ తన వంతు పాత్ర పోషిస్తున్నందుకు గాను ఆమె సేవలను గుర్తించి అవార్డు అందించడం జరుగుతుంది అని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఆమె ఉత్తమ సేవలను గుర్తించి అవార్డు వరించడం పట్ల నసురుల్లాబాద్ మండల ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎందరికో ఆమె ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, సభా ప్రారంభకులు చక్రపాణి, గౌరవ అతిధి పి. మాలిని, ఆత్మీయ అతిధి వేముల రాధిక సురేందర్ రెడ్డి, విశిష్ట అతిథి అంజనీ కుమారి, విశిష్ట అతిధి డా. కె. వీర భోగ వసంత రాయలు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india